టీతో సరైన జోడీ ఈ కారం తొనలు. ఏదో ఒకటి తిందాం అని మొదలెడితే కనీసం ఐదుకి తక్కువ తినకుండా ఉండలేరు. కరకరలాడుతూ నోట్లో పడీపడగానే కరిగిపోతూ ఉంటాయి.

నేను వీటిని కారం తొనలు అని పిలుస్తాను. ఇలాంటి రెసిపీ దేశమంతా ఉంది. బెంగాలీలు, ఉత్తరాది వారు కారేలా నిమ్కీ అంటారు. ఇదే రెసిపీ నేను గోవాలో, మహారాష్ట్రాలో చూశాను, కాకపోతే వారు తెలుగు వారికి మల్లే వేపిన వాటిని పంచదార పాకంలో వేసి తీస్తారు. వీటిని తెలుగు వారు పనస తొనలు అంటారు.

కరేలా నిమ్కీలు(కారం తొనలు), పనస తొనలు చూడ్డానికి ఒకేలా ఉండడం వల్ల, అవి చేసే తీరు పిండికి సామగ్రీ అంతా ఒక్కటేలా అనిపిస్తుంది. కానీ కాదు. కరేలా నిమ్కీలకి నెయ్యి ఎక్కువగా వేయాలి, అప్పుడే అవి మరింత గుల్లగా కరకరలాడుతూ ఉంటాయి. పనసతొనలకి అంత నెయ్యి అవసరం పడదు.

టిప్స్

నెయ్యి/ డాల్డా:

  1. స్వీట్ హౌస్ వారికి కారా అంత కరకరలాడుతూ రావడానికి కారణం పిండిలో డాల్డా వాడడం వల్లే!!! నేను ఇందులో డాల్డాకి బదులు నెయ్యి వేశాను. నిజానికి నూనె కంటే నెయ్యి వాడడం వల్ల మరింత కరకరలాడుతూ ఉంటాయి తొనలు.

మైదాకి బదులు ఇంకేమి వాడుకోవచ్చు:

  1. ఈ కారం తొనలు మైదాతో చేస్తేనే తేలికగా కరకరలాడుతూ వస్తాయ్. పర్లేదు అనుకుంటే మైదా పిండికి బదులు గోధుమ పిండి ఇంకా 2-3 చెంచాలు బొంబాయ్ రవ్వ వేసి కలుపుకోండి.

పిండి కలిపే తీరు:

  1. పిండి నెయ్యిలో బాగా తడవాలి. అప్పుడే మరింత గుల్లగా వస్తాయ్. ఇంకా నీరు కూడా కొద్దీ కొద్దిగా పోసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి. పిండి పూరి పిండి కంటే గట్టిగా ఉండాలి.

తొనలు వత్తె తీరు:

  1. పొడి పొంది ఎక్కువగా చల్లి పలుచని షీట్ మాదిరి వత్తుకోవాలి. వత్తిన షీట్ మీద కూడా పొడి పిండి చల్లుకోవాలి లేదంటే తొనలు అంటుకుపోతాయ్. ఇంకా అంచులు గట్టిగా సీల్ చేసుకోవాలి.

  2. నా కిచెన్ కేబినెట్ చాలా పెద్దది కాబట్టి పిండి అంతా ఒకేసారి పలుచగా వత్తేశాను. మీరు కావాలంటే 3-4 సగాలుగా పిండిని విడదీసి కూడా వత్తుకోవచ్చు.

తొనలు కాల్చే తీరు:

  1. బాగా వేడెక్కిన నూనెలో కొద్దిగా వేసి ముందు కాస్త రంగు మారేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. ఆలా రంగు మారాయి అంటే పిండి లోపలి దాగా ఉడికినట్లు. అప్పుడు హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోవాలి.
  2. తొనలు బాగా వేడి నూనెలో వేసి వేపితే పైన రంగొస్తాయ్, లోపల పచ్చిగా ఉంది మెత్తగా అయిపోతాయి చల్లారాక.

తొనల పైన చల్లే కారం:

  1. నేను బెంగాలీ వారి తీరులో కారం, నల్ల ఉప్పు కలిపి వేడి తొనల మీద చల్లాను. మీరు కావాలనుంటే తెలుగు వారి కరివేపాకు కారం కూడా వేడి వేడి తొనల మీద చల్లుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి.

కారం తొనలు - రెసిపీ వీడియో

Karam Thonalu | Karela Nimki | How to Make Karam Thonalu

Snacks | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 30 mins
  • Resting Time 10 mins
  • Total Time 41 mins

కావాల్సిన పదార్ధాలు

  • పిండి కలుపుకోడానికి:
  • 250 gms మైదా
  • 50 ml నెయ్యి
  • 1 tbsp సాల్ట్
  • నీరు (పిండి గట్టిగా కలుపుకోడానికి సరిపడా)
  • నూనె (వేపుకోడానికి)
  • 1 Cup పిండి వత్తుకోడానికి మైదా
  • కారం పొడి కోసం:
  • 1/2 Cup కారం
  • 1/4 Cup నల్ల ఉప్పు

విధానం

  1. జల్లించిన మైదా పిండి లో నెయ్యి ఉప్పు వేసి ముందు నీరు కాలపుకుండా బ్రేడ్ పొడి మాదిరి అయ్యేదాకా కలుపుకోవాలి
  2. బాగా కలిపిన పిండిలో తగినన్ని నీరు చేర్చుకుంటూ పిండిని గట్టిగా వత్తుకోవాలి. తరువాత పైన నెయ్యి రాసి 10 నిమిషాలు పక్కనుంచుకోవాలి
  3. 10 నిమిషాల తరువాత పొడి పిండి చల్లి పూరీలంతా మందాన వత్తుకోవాలి. (పొడి పిండి కాస్త ఎక్కువగా చల్లుకోవాలి
  4. పలుచగా వత్తుకున్న పిండిని చతురస్రాకారంలో కోసుకోవాలి. తరువాత చతురస్రాకారంలో చుట్టూ అంచులకి ¼ ఇంచ్ వదిలేసి మధ్యన 4-5 గాట్లు పెట్టుకోవాలి. ఆ తరువాత అంచులని గట్టిగా నొక్కుతూ లోపలికి రోల్ చేసుకోవాలి.
  5. బాగా వేడెక్కిన నూనెలో కొన్ని తొనలు వేసి ముందు మీడియం ఫ్లేమ్ మీద తొనలు రంగు మారేదాకా వదిలేస్తే, తొనలు ఉడుకుతాయ్. ఆ తరువాత పెద్ద ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకుని జల్లెడలో లేదా బుట్టలో వేసుకోవాలి
  6. కారం నల్ల ఉప్పు కలిపి వేడి వేడి తొనలని ఎగరేస్తూ కారం చల్లుకోవాలి. లేదా కరివేపాకు కారం కూడా చల్లుకోవచ్చు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.